Site icon HashtagU Telugu

Etela Rajender : కాంగ్రెస్ సర్కార్ కు ఈటెల రాజేందర్ ఛాలెంజ్..

Etela Rajender comments on revanth reddy

Etela Rajender comments on revanth reddy

లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు , ప్రతిసవాళ్లు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ (Telangana) లో మొన్నటి వరకు బిఆర్ఎస్ vs కాంగ్రెస్ మధ్య వార్ ఉండేది కానీ..ఇప్పుడు బిజెపి vs కాంగ్రెస్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి చెందడం..ఆ తర్వాత పెద్ద ఎత్తున నేతలంతా బయటకు వచ్చి కాంగ్రెస్, బిజెపి లలో చేరుతుండడం..అది కాక లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం తో ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయ్యారు. లోక్ సభ పోటీలో కూడా దిగేందుకు ఆలోచిస్తున్నారు. దీంతో బిజెపి నేతలు…అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ మరింత దూకుడు పెంచుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా మల్కాజిగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దిగిన ఈటెల రాజేందర్ (Etela Rajender) కాంగ్రెస్ ప్రభుత్వం ఫై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ కు ఛాలెంజ్ విసిరారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు. ‘పెన్షన్లు ఇవ్వడానికే గత ప్రభుత్వం అల్లాడిపోయింది. అప్పుడప్పుడు కొన్ని నెలలు పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అమలు చేయలేని పథకాలను ప్రకటించి రేవంత్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : AP Govt Helps : జనసేన సైనికుడికి…జగన్ సాయం