TS/BJP : హస్తినకు ఈటెల, కోమటిరెడ్డి… అమిత్ షాతో భేటీ.!!

  • Written By:
  • Updated On - November 15, 2022 / 12:35 PM IST

మునుగోడు ఉపఎన్నిక బీజేపీకి నిరాశ కలిగించింది. విజయం సాధిస్తామని భావించిన బీజేపీకి ఊహించని ఫలితం ఎదురైంది. దీంతో ఆ పార్టీ తీవ్ర నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తినకు వెళ్లారు. అక్కడ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం…అనంతరం జరిగిన పరిస్థితులపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. మునుగోడులో ఓటమి కారణం ఏంటీ… బీజేపీ పై వచ్చిన ఆరోపణల గురించి క్లుప్తంగా అమిత్ షాకు వివరించనున్నట్లు సమాచారం.

కాగా ఆగస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అదే రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2018లో మునుగోడు నుంచే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కాగా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవలన్న పకడ్బందీ ప్లాన్ లో బీజేపీ ఉంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మునుగోడు ఉపఎన్నికకు ముందు ఈటెలతో అమిత్ షా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీ నేతలు అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీ పెద్దలు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 20 వ తేదీ నుంచి 3 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించనుంది.