Site icon HashtagU Telugu

Gajwel Battle: గజ్వేల్‌లో ఈటెల వర్సెస్ కేసీఆర్ మినీ యుద్ధం

Gajwel Battle

Gajwel Battle

Gajwel Battle: తెలంగాణ ఎన్నికల కోడ్ అమలైంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని కూడా ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ హీట్ పుట్టిస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఆదివారం అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. అంతకుముందు కాంగ్రెస్ 6 హామీలతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళింది. ఇప్పుడు బీజేపీ పార్టీ తమ రాజకీయ వ్యూహాన్ని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు కేసీఆర్ 115 మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తే కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఈ విషయంలో కూడా బీజేపీ వెనుకంజలో ఉంది. ఇదిలా ఉండగా ఈ సారి గజ్వేల్ నియోజకవర్గంలో పోరు భీభత్సంగా ఉండేలా కన్పిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు .జమ్మికుంటలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ చేసిన సవాల్‌పై ఈటెల స్పందించారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ..  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు అధికార పార్టీ 100 కోట్లు ఖర్చు చేశారని , అంతే కాకుండా మొత్తం కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి తనను ఓడించేందుకు అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నారని, ఆ ఉపఎన్నిక తర్వాత గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈటెల. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ పాలిటిక్స్ మరింత హాట్ హాట్ గా కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఈటెల. కేసీఆర్ పోరు మినీ యుద్ధంగా మారే అవకాశం ఉంది.

Also Read: Balakrishna Counter to Kodali Nani : నువ్వేం పీక్కొని గెడ్డం పెట్టుకుంటావ్.. కొడాలి నానికి బాలయ్య కౌంటర్