తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీమంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్పీకర్ ను మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈటల అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు మీడియా ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యేగా 20ఏళ్ల అనుభవం ఉందంటున్న ఈటల…స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరుస్తూ మాట్లాడటం బాధాకరం అన్నారు. అనుభవంతో నేర్చుకున్నది ఇదేనా ఈటెల అంటూ ప్రశ్నించారు. స్పీకర్ ను అవమానిస్తే మొత్తం శాసనసభను అవమానించినట్లే అన్నారు. వెంటనే స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సభా నిబంధనల ప్రకాం ముందుకు వెళ్తామంటూ స్పష్టం చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి.