Site icon HashtagU Telugu

Etela Rajender : కేంద్రమంత్రి అమిత్​ షాతో ఈటల రాజేందర్ భేటీ

Etela Amith

Etela Amith

మల్కాజ్ గిరి బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ (Etela Rajender )..కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తో భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే ఛాన్స్ ఉందనే ప్రచారం తో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవడంతో ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని బిజెపి అధిష్టానం నిర్ణయించారని ప్రచారం సాగుతున్న వేళ వీరిద్దరి భేటీ ఫై అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. ఒకటి రెండు కాదు ఏకంగా 8 స్థానాల్లో విజయ డంఖా మోగించడంతో కేంద్రం రెండు కేంద్ర మంత్రి పదవులను తెలంగాణ నేతలకు ఇచ్చింది. నిన్న రాష్ట్రపతి భవన్ లో ఎంపీలు కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ఈసారి తనకు తప్పకుండా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఈటెల రాజేందర్ భావించారు. కానీ తనకు కాకుండా పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు అప్పగించడం కాస్త నిరాశకు గురి చేసింది. అయితే పదవి ఆశించి భంగపడిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

రెండోసారి మోడీ మంత్రివర్గంలో కిషన్ రెడ్డి ఎంపిక కావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈటలకు ఈ బాధ్యతలు కట్టబెడతారని విశ్వసనీయ సమాచారం. అలాగే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన బండి సంజయ్​ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ తన ప్రత్యర్థి కాంగ్రెస్​ నేత సునీత మహేందర్​ రెడ్డిపై 3.86 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ పార్లమెంట్​ స్థానం నుంచి ఎవరు గెలిచినా వారు రాజకీయపరంగా అత్యున్నత శిఖరాలకు వెళ్తారనేది ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈటలకు స్టేట్​ ప్రెసిడెంట్ పదవి కట్టబెడితే ఈ ఆనవాయితీ కొనసాగినట్లవుతుంది. మరి బిజెపి అధిష్టానం ఏంచేస్తుందో చూడాలి.

Read Also : Viral : ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న మహిళలు..