ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) గాలి బాగా వీస్తుంది..పదేళ్ల బిఆర్ఎస్ సర్కార్ చూసిన ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూద్దామని డిసైడ్ అయ్యి..ఆ అవకాశం ఇచ్చారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల హామీలను అమలు చేస్తూ..గత ప్రభుత్వ లోపాలను బయటపెడుతోంది. ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ ఫై పూర్తి నమ్మకం వచ్చింది. పలు వాటిల్లో కాస్త విమర్శలు వస్తున్నప్పటికీ…ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తుందనే అంత నమ్ముతున్నారు. ఇక మిగతా పార్టీల నేతల్లో అదే నమ్మకం కలిగి..ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ముఖ్యంగా గత పది రోజులుగా బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు బిజెపి కీలక నేత ఈటెల రాజేందర్ (Etela Rajender) కూడా కాంగ్రెస్ గూటికి రాబోతున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం..గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చిన పట్నం మహేందర్ రెడ్డి తో మైనంపల్లి హనుమంతరావులతో ఈటెల సమావేశం అవ్వడమే. గత ప్రభుత్వంలో మంత్రి గా , ఎమ్మెల్యే గా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి..నిన్న కాంగ్రెస్ గూటికి చేరారు. ఈయన తో పాటు ఈయన భార్య , అలాగే మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ , తదితరులు నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డికి మంచి ట్రీట్ ఇచ్చారు మైనంపల్లి హనుమంతరావు. అయితే వీరి పార్టీకి ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. దీంతో ఈటల రాజేందర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కరీంనగర్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది. మరి ఈటెల నిజంగానే కాంగ్రెస్ లో చేరతారా..? లేక మరికొద్ది రోజులు వెయిట్ చేస్తారా అనేది.
Read Also : Chandrababu : నేతలను బుజ్జగించే పనిలో బాబు..