Site icon HashtagU Telugu

Telangana RTC Bill: గవర్నర్ ఊర్లో లేకపోయినా కేసీఆర్ హడావుడి..

Telangana RTC Bill

New Web Story Copy 2023 08 05t145849.503

Telangana RTC Bill: తెలంగాణలో ఏడాది కాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగింది. అధికారపార్టీ బీఆర్ఎస్ ఫైల్ పంపడం, దాన్ని రాజ్ భవన్ ఆమోదించకపోవడం జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య పలు మార్లు మాటల యుద్ధం కొనసాగింది. సీఎం కేసీఆర్ పై గవర్నర్ జాతీయ స్థాయిలో విమర్శలు చేశారు. అటు గవర్నర్ తమిళిసై వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు అధికార పార్టీ నేతలు. తాజాగా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ లా మారింది.

ప్రస్తుతం గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. ఈ ఫైల్ ని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే తమిళిసై నగరంలో లేనప్పటికీ బీఆర్ఎస్ హడావుడిగా వ్యవహరిస్తోంది. ఫైల్ పంపి మూడు రోజులవుతున్నా ఆమోదించలేదంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులతో రాజ్ భవన్ ముట్టడికి ఉసిగొల్పింది. దీంతో కార్మికులు రాజ్ భవన్ వద్ద హడావుడి చేశారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీగా పోలీసులు మోహరించారు.

కార్మికులు నిరసనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ విలీన ఫైల్ ని క్షుణ్ణంగా పరిశిలించాల్సి ఉందని, ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనల్లో ఉన్నట్టు ఆమె చెప్పారు. నేను ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకం కాదని, గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు కూడా తెలిపానని ఆమె అన్నారు. కార్మికులకు నేనెప్పుడూ మద్దతు ఇస్తానని, అయితే ఆర్టీసీ విలీనం చేసే వ్యవహారంపై పూర్తిగా స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ని ముట్టడించడం చాలా బాధగా ఉందని, దీనివల్ల అక్కడ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.

ఆర్టీసీ విషయంలో ప్రభుత్వ చర్యను ఈటెల రాజేందర్ పూర్తిగా వ్యతిరేకించారు. ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో అధికార పార్టీ గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ హైదరాబాద్ లో లేరని తెలిసినా కేసీఆర్ హడావుడి చేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు రాజేందర్. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు నమ్మే పరిస్థితిలో లేరని, కార్మికుల సమస్యలు వచ్చే ప్రభుత్వమే తీరుస్తుందని తెలిపారు. మరోవైపు ఆర్టీసీ విలీనాన్ని తాము వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు

Also Read: Neha shetty : హాట్ షో చేస్తున్న డీజే టిల్లు బ్యూటీ

Exit mobile version