Site icon HashtagU Telugu

Telangana: హామీలను మరిచిన కేసీఆర్: ఈటెల

Telangana

Telangana

Telangana: ఈటెల రాజేందర్ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ రోజు ఈటెల రాజేందర్ రంగారెడ్డి జిల్లా, సురంగల్ గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ గ్రామంలోని రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేశారు. వికలాంగులకు, వృద్దులకు వీల్ ఛైర్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాజేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు. రైతుబంధు కింద రైతులకు 5 వేలు ఇస్తూ, మిగతా పథకాలను గంగలో కలిపేసినట్లు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించడంలో కెసిఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు.మోదీ దేశవ్యాప్తంగా 3.50 కోట్ల ఇళ్లు ఇచ్చారని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఇళ్లు కట్టించినట్టు చెప్పారు. ఇది నేను చెప్తుంది కాదని, సర్వేలు చెప్తున్నాయని ఈటెల చెప్పారు.

తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని అన్నారు. ఇన్నేళ్ళైనా ప్రజలకు ఇస్తానన్న ఇళ్లను ఎందుకు మంజూరు చేయలేదో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.పేద ప్రజలకు సొంతింటి కల తీర్చకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కళ్లలో మట్టి కొట్టిందని విమర్శించారు. తెలంగాణలో పేదలు కోరుకునేవి రెండే రెండు అని, ఒకటి సొంత ఇల్లు, రెండు చనిపోతే పూడ్చడానికి స్మశానవాటిక అని అన్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో ఏదీ నోచుకోలేదని విమర్శించారు.

Also Read: Tollywood : పాపం శివాత్మిక…గట్టిగానే చూపిస్తుంది కానీ..చాన్సులే రావట్లే