Eetela : తెలంగాణతో కేసీఆర్ బంధం తెగిపోయింది…!!

ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్.... జాతీయ పార్టీపై ప్రకటన చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 04:39 PM IST

ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్…. జాతీయ పార్టీపై ప్రకటన చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్ గా మారుతుందని కేసీఆర్ ప్రకటన జాకీ చేశారు. దీనిపై పలు పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే…ఈటల రాజేందర్ స్పందించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రకటించడంతోనే తెలంగాణతో కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు.

టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి తీర్మానం చేయడాన్ని ఈటల తప్పుబట్టారు. ఉద్యమపార్టీని ఖతం చేసి…ఉద్యమకారులను మరిచిపోయేటట్లు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్టీ ప్రకటనతో టీఆర్ఎస్ తెలంగాణా ప్రజానీకానికి టీఆర్ఎస్ కు ఉండే బంధం తెగిపోయిందన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకుని ఆయన నమ్ముకున్నది మద్యాన్ని, డబ్బును, ప్రలోభాలను అన్నారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చేయాలని పగటికల కంటున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో సమస్యలను పరిష్కరించలేనివాడు.. దేశంలో సమస్యలను ఎలా పరిష్కరిస్తాడంటూ ప్రశ్నించారు. ఏదిఏమైనప్పటికీ కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీయడానికి పోయినట్లు ఉందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.