Site icon HashtagU Telugu

Etela Rajender : మరో జన్మ ఎత్తినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు

Etela Rajender Phone Tappin

Etela Rajender Phone Tappin

తెలంగాణ (Telangana) లో లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ – బిజెపి పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కువ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైనే ప్రచారం నడుస్తుంది. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిందని..వాటిని అమలు చేయలేదని..బిజెపి , బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు..ఇచ్చిన హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తామని సవాళ్లు విసురుతుంటే..మరో జన్మ ఎత్తినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మల్కాజ్ గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇందు ఫార్చ్యూన్ విలాస్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఈటల (Etela Rajender) పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2 లక్షల కోట్లు కోవాలని కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఆలాంటప్పుడు కాంగ్రెస్ హామీల అమలు ఎలా సాధ్యమో ఆలోచించాలన్నారు. బిజెపి పై బిఆర్ఎస్ , కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల పై ఈటెల విమర్శలు కురిపించారు. మోడీ అభివృద్ధిపేరుతో ఓట్లు అడుగుతున్నారే తప్ప కేవలం జై శ్రీరామ్ పేరుతో ఓట్లు అడుగుతున్నారనేది తప్పు అన్నారు. ఎవరైనా సరే కళ్లు నెత్తికెక్కిమాట్లాడకూడదని, మన పరిధి, మన స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారనే సోయి ఉండాలని హెచ్చరించారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి ఇండ్లు కట్టించిందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కల్పన గురించి గొప్పగా చెప్పిన కేసీఆర్ ఇళ్లను మాత్రం ఎక్కడా కట్టలేదని ఆరోపించారు. కేంద్రం 2 లక్షల 53వేల ఇస్తే కట్టినం అని చెప్పినవి 1 లక్ష 75 వేల ఇల్లులు అయితే పంచినవి 40 నుంచి 50 వేలు మాత్రమేనని విమర్శించారు.

Read Also : AP : పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పై షర్మిల ఆగ్రహం