Etela Rajender: తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ రోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఈటెల రాజేందర్ సతీమణి జమున ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా రాజేందర్ మాట్లాడుతూ… అవును నన్ను జాగ్రత్తగా ఉండాలని కొందరు బెదిరిస్తున్నారని అన్నారు. గతంలోకి గ్యాంగ్ స్టార్ నయీమ్‌కే భయపడలేదు, ఈ చిన్నా చితక బెదిరింపులు నాకు కొత్తేమి కాదన్నారు ఈటెల రాజేందర్. ఇక పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఈటెల. పార్టీ మారడం అంటే షర్ట్ వేసుకున్నంత సులువు కాదన్నారు. ఇక కెసిఆర్ నన్ను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించేసిండు, నా అంతట నేను బయటకు రాలేదని స్పష్టం చేశారు. నన్ను పార్టీ నుండి బయటకు పంపించడం కెసిఆర్ కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదని, ఆ సమయంలో వారు ఎంతో బాధపడి ఉంటారన్నారు. మొత్తానికి భారాసను కొట్టేది భాజపానేనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.
Read More: Assistant Section Officers: 1,592 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌లను సెక్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి