Lok Poll : లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 12 స్థానాల్లో విజయం సాదించబోతుంది – ఈటెల

కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని..కానీ వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత మూటకట్టుకుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు

  • Written By:
  • Publish Date - May 16, 2024 / 03:44 PM IST

ఇటీవల తెలంగాణ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో (LOk Sabha Elections) బిజెపి (BJP) 12 స్థానాల్లో విజయం సాదించబోతుందని జోస్యం తెలిపారు మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ (Etela Rajender). హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని..కానీ వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత మూటకట్టుకుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి 12 లోక్‌సభ స్థానాల్లో విజయం సాదించబోతుందని..తెలంగాణ రాజాలు , యువత అంత బిజెపిని కోరుకుంటున్నారని ఈటెల చెప్పుకొచ్చారు. నల్గొండ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు కూడా మోడీ వైపే చూస్తున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్‌ను గెలిపించాలని ఈటల కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈటెల ధీమా ఇలా ఉంటె అటు కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలు సైతం గెలుపు మాదంటే మాదే అంటూ మీడియా ముందు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..లోక్​సభ ఎన్నికల్లో సైలెంట్ ఓటు తమకే అనుకూలంగా ఉంటుందని, మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో గెలుస్తున్నామని మహబూబాబాద్ లాంటి చోట్ల కూడా అనూహ్య ఫలితాలు వస్తాయని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క నల్గొండలో మాత్రమే పక్కాగా గెలిచే అవకాశం ఉందని అన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు బాగా పంచిందన్న కేటీఆర్, ధన ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాదించబోతుందని తెలిపారు. మరి ఈ మూడు పార్టీల్లో మెజార్టీ స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటుందో చూడాలి.

Read Also : AP : ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన జగన్