Site icon HashtagU Telugu

Etela Rajender : తనను బద్నాం చేయడానికే ఈ ప్రచారం – ఈటెల

Etela Cng

Etela Cng

ఉదయం (శనివారం) నుండి ఈటెల రాజేందర్ (Etela Rajender) కు సంబదించిన ఓ పిక్ వైరల్ గా మారింది. ఈ పిక్స్ లో కాంగ్రెస్ నేతలు (Congress Leaders) మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలతో ఈటల రాజేందర్ ఉండడం..అంత కలిసి ఒకే చోట ఉండడం తో…ముగ్గురు నేతలు చర్చించుకోవడంతో ఈటెల త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. గత కొద్దీ రోజులుగా ఈటల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నారని , మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన టిక్కెట్ అడుగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ హైకమాండ్ ఏదీ తేల్చడం లేదని, దీంతో అంగంలోకి దిగిన కాంగ్రెస్…ఈ ఆఫర్ లు ఈటల రాజేందర్ కు ఇచ్చేందుకు ఓకే చెప్పిందని..ఇప్పటికే రేవంత్ తో ఈటెల చర్చలు కూడా జరిపారని..అందులో భాగమే ఈ ముగ్గురు నేతలు కలవడం అని పెద్ద ఎత్తుగా ఉదయం నుండి కథనాలు ప్రచారం అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే కావొచ్చు..ఇప్పటీకే పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారని..ఈటెల కూడా అదే బాట పట్టబోతున్నారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఈ వార్తలపై ఈటెల క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను తీవ్రంగా ఖండించారు. తనను బద్నాం చేయాలనే ఇలా ప్రచారం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్పోరేటర్ నరసింహారెడ్డి గృహప్రవేశానికి తాను హాజరయ్యానని… ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారని తెలిపారు. ఈ సమయంలో వారితో కలిసి తాను భోజనం చేసినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ నేతలతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదన్నారు. ఆ కార్యక్రమంలో అందరితో కలిసి మాట్లాడాను… అందరితో కలిసి భోజనం చేశానని స్పష్టం చేశారు. అంతే తప్ప కాంగ్రెస్ లో చేరేందుకు కాదని స్పష్టం చేసారు.

Read Also : Telangana Assembly : అసెంబ్లీ టీవీలో మాముఖాలు చూపించరా..? ఇంత అన్యాయమా..? – హరీష్ రావు