Site icon HashtagU Telugu

Etala focus: టీఆర్ఎస్ పై ‘ఈటల’ మరో సైరన్!

Singareni

Singareni

ఈటల రాజేందర్… టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగాడు. కొన్ని కారాణాల వల్ల టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పడం,  ఆయన బీజేపీలో చేరడం, హుజురాబాద్ ఎన్నికల బరిలో నిల్చుకోవడం, భారీ మెజార్టీతో గెలవడం చకచకా జరిగిపోయాయి. సమకాలీన అంశాలు, రాజకీయ వ్యవహారాలపై ఈటలకు మంచి పట్టుంది. దీంతో తెలంగాణ బీజేపీ ఈటల చతురతను వాడుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)లో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంపై బిజెపి దృష్టి సారిస్తోంది. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోల్ బెల్ట్ ప్రాంత నాయకులతో చర్చలు జరుపుతుండటం ఆసక్తిగా మారింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS)కి అనుబంధంగా ఉన్న BJP సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బలంగా లేదు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు టీబీజీకేఎస్‌ కార్యకలాపాలను ఈటల రాజేందర్‌ చూసేవారు. కానీ ఈ సారి బీజేపీ కోసం పనిచేయడం ఆసక్తిగా మారింది.

శ్రీరాంపూర్‌లోని ఆర్‌కే-5 గనిలో బొగ్గు కార్మికుల గేట్‌ మీటింగ్‌లో రాజేందర్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు గడ్డం వివేక్‌, బీఎంఎస్‌ జాతీయ ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మా రెడ్డి పాల్గొని రెండు కాలనీలను సందర్శించారు. మంచిర్యాల జిల్లా కార్మికుల కుటుంబాలతో మాట్లాడారు. తాము ఇళ్లు నిర్మించుకున్న భూములకు ఎస్‌సిసిఎల్‌ పట్టాలు ఇవ్వలేదని, నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని పలు కుటంబాలు రాజేందర్‌కు తెలిపాయి. అధిక విద్యుత్ బిల్లులపై కూడా ఫిర్యాదు చేశాయి. BMS-BJP ప్రచారం 10 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే ఈటల రాజేందర్ పర్యటనతో ఈ సారి సింగరేణి ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది!

Exit mobile version