Telangana Pavilion : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ‘పెట్టుబడి పెట్టండి’ అనే నినాదంతో ఈ పెవిలియన్ ఏర్పాటైంది. ఈ పెవిలియన్‌కు ‘సృజనాత్మక.. సంప్రదాయాల కలయిక..’ అనే ట్యాగ్ లైన్‌ను వాడారు. తెలంగాణ సంస్కృతి, సాంకేతిక సృజనాత్మకతను ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్, పోచంపల్లి ఇక్కత్, చేర్యాల పెయింటింగ్స్, టీ హబ్ భవనం ఫొటోలతో తెలంగాణ పెవిలియన్ వాల్‌ను తీర్చిదిద్దారు. పెట్టుబడులకు దేశంలోనే మొదటి గమ్యస్థానం, అపారమైన అవకాశాలున్న రాష్ట్రం తెలంగాణ అనే నినాదాలతో డబ్ల్యూఈఎఫ్ సదస్సు వేదికగా పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు. ‘మీకోసమే తెలంగాణ’(Telangana Pavilion) అనే ఒక హోర్డింగ్‌ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణంపై తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండేతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ( సీ4ఐఆర్) ఏర్పాటుపై ఈసందర్భంగా సంయుక్త ప్రకటన చేశారు. బయోఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్ ప్రారంభం కానుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఉంటాయని సీఎం రేవంత్ తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యంతో వేగంగా లక్ష్యాలు అందుకోవచ్చన్నారు. ప్రజారోగ్యం, సాంకేతికత, మెరుగైన జీవితం కల్పించడం వంటి లక్ష్యాలను చేరుకోవచ్చని చెప్పారు.
Also Read: Direct To Mobile : డైరెక్ట్ టు మొబైల్.. ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ, ఓటీటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల నియామకం అయ్యారు. ఏపీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వేసిన వ్యూహాత్మక అడుగులో భాగంగా వైయస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించారు. షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా నియమించడం పట్ల తెలంగాణ పిసిసి చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి షర్మిలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి, వైయస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేశారో ఆ తర్వాత పార్టీ లైన్ కు కట్టుబడి రేవంత్ రెడ్డి తో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రేవంత్ రెడ్డి కుటుంబం రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను ఇంటికి వెళ్లి మరీ ఇచ్చి వచ్చారు.