Site icon HashtagU Telugu

Errabelli Pradeep Rao : గులాబీకి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గుడ్ బై…కమలానికి జై…?

Errabelli

Errabelli

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అంతకంతకూ మారుతున్నాయి. ఈ మధ్యే కోమట్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి….బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన బాటలోనే మరికొంతమంది లీడర్లు నడుస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆరెస్ కు బై బై చెప్పారు. కారుపార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

2018లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్ ..తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించిన భంగపడ్డారు ప్రదీప్ రావు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆరెస్ రాజీనామా చేసినట్లు ప్రదీప్ రావు ఆదివారం ప్రకటించారు. వరంగల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ప్రదీప్ రావు బీజేపీలో చేరడం ఖాయమని..కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో చేరుతున్నట్ల తెలిపారు.

ఇక టీఆరెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నో అవమానాలకు గురయ్యాయని చెప్పిన ప్రదీప్ రావు…అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగానన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని… నా కార్యకర్తలకు టీఆరెస్ ఏమీ చేయలేదన్నారు. బంగారు తెలంగాణ కోసం త్యాగాలు చేశానని..స్థానిక ఎమ్మెల్యే అవమానపరిచేలా మాట్లాడారన్నారు. పార్టీలో ఉండగానే ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టారని వాపోయారు. దాన్ని ఎవరూ ఖండించలేరన్నారు. ఏ పార్టీ ఆదరిస్తే…ఆ పార్టీలోకి వెళ్తానని లేదంటే స్వతంత్రంగా ఉంటానని ప్రదీప్ రావు స్పష్టం చేశారు.