Site icon HashtagU Telugu

Errabelli Dayakar Rao : కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి..క్లారిటీ వచ్చేసింది..!!

Errabelli Dayakar Rao requested Nagarjuna for film studio in Warangal

Errabelli Dayakar Rao requested Nagarjuna for film studio in Warangal

తెలంగాణలో బిఆర్ఎస్ (BRS) పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది..ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీ లో చేరడం గొప్పగా భావించిన వారు..ఇప్పుడు ఆ పార్టీ అంటేనే చెత్త అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్..ఆ తర్వాత పదేళ్ల పాటు రాష్ట్ర సీఎం గా పాలించారు. కానీ ఈ పదేళ్లలో కేసీఆర్ చేసిన ఎన్నో తప్పుల కారణంగా ఈరోజు రాష్ట్రంలో బిఆర్ఎస్ అనేది లేకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ సగం కాగా..ఉన్న ఆ సగం కూడా బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుండి మొన్నటి లోక్ సభ ఎన్నికల వరకు ఎంతో మంది కీలక నేతలు కాంగ్రెస్ , బిజెపి లలో చేరగా …తాజాగా మరో సీనియర్ నేత , మాజీ మంత్రి సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు వైరల్ గా మారాయి. మాజీ మంత్రి, వరంగల్ జిల్లాలో కీలక నేత అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడుతారనే టాక్ ..ఆ పార్టీ శ్రేణుల్లో కలవరపెడుతుంది. గత రెండు రోజులుగా దయాకర్ రావు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు తెగ ప్రచారం అవుతుండడం తో వాటిపై దయాకర్ రావు (Errabelli Dayakar Rao) క్లారిటీ ఇచ్చారు.

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దయాకర్ రావు క్లారిటీ తో కాస్త ఊపిరి పీల్చుకున్న లోలోపల మాత్రం ఇప్పుడు కాకపోయినా కొద్దీ రోజులకైనా పార్టీ మారుతారు కావొచ్చు అని మాట్లాడుకుంటున్నారు.

ఇక దయాకర్ రావు రాజకీయ ప్రస్థానం చూస్తే..

ఎర్రబెల్లి దయాకర్ రావు 1983లో తొలిసారి శాసన సభ్యులుగా పోటీచేసి ఓడిపోయాడు. 1987లో వరంగల్ డిసిసిబి అధ్యక్షునిగా పదవి లభించింది. వరంగల్ జిల్లాకు రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షులుగా పనిచేసాడు. 1994లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక 2008 ఉప ఎన్నికలలో కూడా వరంగల్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రవీంద్ర నాయక్ ను ఓడించి, తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించాడు. మొత్తం 3 సార్లు శాసన సభ్యులుగా వర్ధన్నపేట నుండి ఎన్నిక కావడమే కాకుండా, 2009, 2014, 2018లో పాలకుర్తి నుంచి వరసగా 4వ సారి, 6వ సారి డా. నెమురుగోమ్ముల సుధాకర్ రావు సహకారంతో పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులైనాడు.

2014లో దుగ్యాల శ్రీనివాస రావు పై,2018లో జంగ రాఘవ రెడ్డి పై 53,009 మెజారిటితో గెలుపొంది పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి 4, 5, 6,వసారి శాసనసభలో ప్రవేశించాడు. డబుల్ హాట్రిక్ ఆరు సార్లు విజయం సాధించిన బహుకొద్ది మంది శాసన సభ్యుల్లో ఒక్కడు. 2016లో టిడిపి పార్టీని వదలి బిఆర్ఎస్ (తెరాస) లో చేరాడు. కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేసాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

Read Also :  TMC MP Yusuf Pathan: యూసుఫ్ పఠాన్‌కు నోటీసులు