Site icon HashtagU Telugu

Errabelli Dayakar Rao : వరంగల్‌లో ఫిలిం స్టూడియో పెట్టండి.. KCRతో మాట్లాడి ఎంత భూమి కావాలన్నా ఇప్పిస్తా..

Errabelli Dayakar Rao requested Nagarjuna for film studio in Warangal

Errabelli Dayakar Rao requested Nagarjuna for film studio in Warangal

తెలంగాణ(Telangana) వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్ చేసే సినిమాలు, ఇక్కడి యాసతో వచ్చే సినిమాలు పెరిగాయని చెప్పొచ్చు. అలాగే తెలంగాణాలో ఉన్న ఎన్నో అందమైన ప్రదేశాల్లో షూటింగ్స్(Shootings) ఇటీవల పెరిగాయి. అయితే గత కొంతకాలంగా హైదరాబాద్(Hyderabad) తర్వాత వరంగల్(Warangal) లో ఫిలిం ఇండస్ట్రీ(Film Industry) పెట్టాలి, సినిమాలకు సంబంధించిన పనులు అక్కడ కూడా జరగాలని అంటున్నా అవి ఆచరణలోకి మాత్రం రావట్లేదు. కానీ ఇటీవల వరంగల్లో సినిమా ప్రమోషన్స్ మాత్రం పెరిగాయి.

తాజాగా అఖిల్ ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా రిలీజ్ కానుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించగా నాగార్జునతో పాటు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గతంలో కూడా చాలా సార్లు అడిగాను. ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాను. వరంగల్ లో ఫిలిం స్టూడియో కట్టండి. మీకు ఎంత భూమి కావాలో అడగండి KCR తో మాట్లాడి నేను ఇప్పిస్తా. కానీ ఇక్కడ ఫిలిం స్టూడియో కట్టే బాద్యత మీదే. వరంగల్ లో చాలా సినిమాలు షూటింగ్స్ చేసుకున్నాయి. అవన్నీ మంచి హిట్ అయ్యాయి. ఇక్కడ సినిమా ప్రమోషన్స్ కూడా చేసినవి మంచి హిట్ అయ్యాయి. మళ్ళీ మళ్ళీ వరంగల్ కు ప్రమోషన్స్ కు రండి. మీకేం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను అని నాగార్జునను ఉద్దేశించి అన్నారు. మరి వరంగల్ లో ఫిలిం స్టూడియో ఎవరు, ఎప్పుడు కడతారో చూడాలి.