కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసలు మాత్రం తగ్గడం లేదు..లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బిఆర్ఎస్ పార్టీ (BRS Party) నుండి పెద్ద ఎత్తున కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నారు. కేసీఆర్ నమ్మిన వ్యక్తులు సైతం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కప్పుకోగా..ఇక మిగిలిన కొద్దీ గొప్ప మంది కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఈరోజు ఉదయం బిఆర్ఎస్ కీలక నేత, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు (BRS Ex MLA Rathod Bapu Rao) తో పాటు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా..కొద్దీ సేపటి క్రితం బిఆర్ఎస్ నేత ఏపూరి సోమన్న కాంగ్రెస్ గూటికి చేరారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ ఉద్యమకారుడిగా, కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపూరి సోమన్న (Epuri Somanna) కు.. కేసీఆర్ (KCR) సర్కార్ సంస్కృతిక సారధిలో ఉద్యోగం ఇచ్చింది. అయినప్పటికీ ఆ పదవికి రాజీనామా చేసి..కేసీఆర్ కు వ్యతిరేకంగా పాటలు పాడి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. మళ్లీ ఏమైందో ఏమోగానీ సడెన్ గా వైస్ షర్మిల స్థాపించిన YSRTP లో చేరారు. తుంగతుర్తి నుండి బరిలోకి దిగాలని అనుకున్నాడు. కానీ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తో..మళ్లీ బిఆర్ఎస్ లో చేరాడు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి చెందడం..ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్ఎస్ అనేది లేకుండా అవుతుండడం తో ఇక బిఆర్ఎస్ లో ఉంటె కుదరదని చెప్పి..మళ్లీ నేడు కోమటిరెడ్డి రాజగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. మరి ఇందులో ఎంతకాలం ఉంటాడో చూడాలి.
Read Also : Mann: క్రిమినల్స్‌కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్‌కి ఇవ్వడం లేదు: పంజాబ్ సీఎం