Exams Vs Election Dates : ఎన్నికల తేదీల్లో ఎన్నో ‘పరీక్షలు’.. విద్యార్థులు, అభ్యర్థుల్లో ఆందోళన

Exams Vs Election Dates : దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.

  • Written By:
  • Updated On - March 17, 2024 / 08:27 AM IST

Exams Vs Election Dates : దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నాలుగు రాష్ట్రాల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ పోల్స్ కూడా జరగనున్నాయి. అయితే ఎన్నికల తేదీల్లోనే పలు పోటీపరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలు, ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లు ఉన్నాయి. మన  తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో కొన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఒకే విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఎన్నికల షెడ్యూలుకు అనుకూలంగా గతంలో పరీక్షల తేదీల్లో(Exams Vs Election Dates) మార్పులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మేరకు మార్పులు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల తేదీల్లోనూ మార్పులు జరగొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఏయే తేదీలు.. ఏయే పరీక్షలు ?

  • తెలంగాణలో మే 9 నుంచి 12 వరకు TS EAPCET, ఏపీలో మే 13 నుంచి 19 వరకు AP EAPCET పరీక్షలు జరగాల్సి ఉంది.  వీటికి లక్షలాది మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
  • జేఈఈ 2024 మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనున్నారు.
  • యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. .
  • మే 2 నుంచి 13 వరకు ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు రాస్తుంటారు.
  • కేంద్రీయ విద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సీయూఈటీ యూజీ పరీక్షలు మే 15 నుంచి 31 వరకు జరగాల్సి ఉంది.
  • ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామకాలకు  మే 9, 10, 13 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది అప్లై చేశారు.

Also Read : Lok Sabha Election 2024: ఈసారి 7 దశల్లో ఎన్నికలు.. 2014, 2019లో ఎన్ని ద‌శ‌ల్లో పోలింగ్ జ‌రిగిందంటే..?

ఎన్నికల వల్ల  ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపులు, ప్రజా రవాణా సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎగ్జామ్ సెంటర్లు దూరంగా పడితే రాకపోకలకు అసౌకర్యం కలగొచ్చని అభ్యర్థులు భయపడుతున్నారు. ఇంకొందరు అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం లేకుండా పోతుందేమోనని కలవర పడుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షల షెడ్యూల్‌లలో మార్పులు చేసే దిశగా చొరవ చూపాలని సంబంధిత విభాగాలను అభ్యర్థులు కోరుతున్నారు.