Site icon HashtagU Telugu

ORR Lights: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు కాంతివంతంగా తయారయ్యింది

ORR lights

ORR lights

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు కాంతివంతంగా తయారయ్యింది. ఓఆర్ఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు పెట్టాలని.
హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తయిందని దీనితో ఓఆర్ఆర్ పై ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశముందని హెచ్ఏండీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఓఆర్ఆర్ పై 136 కిలో మీటర్ల పరిధిలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీలలో వంద కోట్లకు పైగా ఖర్చుతో వీటిని ఏర్పాటు చేశారు. 136 కిలో మీటర్ల పరిధిలో ఉన్న జంక్షన్స్, అండర్ పాస్లు, రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్లలో మొత్తం 6340 పోల్స్ కి, 13392 ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు.

గచ్చిబౌలి నుండి శంషాబాద్ మధ్యలో 22 కిలోమీటర్ల పరిధిలో 30 కోట్లతో 2018లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన లైట్లతో
మొత్తంగా ఓఆర్ఆర్ లోని 158 కిలో మీటర్ల మేర ఎల్ఈడీ లైట్లు వెలుగనున్నాయి.

గతంలో ఈ ప్రాంతంలోని స్ట్రీట్ లైట్లను వెలిగించడానికి, ఆర్పివేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉండేది. తాజాగా ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో ఇప్పుడా అవసరం లేకుండా వాటంతట అవే ఆరిపోతాయి.
ఒకప్పుడు వీధి దీపాలు చెడిపోతే మరమ్మతులు చేయడానికి, కొత్తవి అమర్చేందుకు భారీగా ఖర్చు చేసేవాళ్లు. ఇప్పుడా అవసరం లేకుండా వీధి దీపాలను నిర్వహిస్తున్న సంస్థే చెడిపోయిన వాటిని తీసేసి కొత్తవి అమర్చుతోంది. ఆగిపోయిన విద్యుత్​ దీపాలను 48 గంటల్లో పునరుద్ధరిస్తోంది. ఫలితంగా ఎలాంటి ఖర్చు, శ్రమ, మానవ వనరుల అవసరం లేకుండా వీధి దీపాల నిర్వాహణ సాఫీగా సాగనుంది.