Govt Schools:తెలంగాణలో ఏపీ తరహా ఎడ్యుకేషన్‌!

ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తున్న ఇంగ్లీష్‌ మీడియం టీచింగ్‌ తెలంగాణలోనూ అమలు కాబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కేబినెట్‌ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని వేశారు.

  • Written By:
  • Publish Date - January 17, 2022 / 06:59 PM IST

ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తున్న ఇంగ్లీష్‌ మీడియం టీచింగ్‌ తెలంగాణలోనూ అమలు కాబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కేబినెట్‌ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని వేశారు.

ఏపీలో ఇంగ్లీష్‌ మీడియం బోధన రాజకీయ వివాదంగా మారింది. అయినా ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియాన్ని గత ఏడాది నుంచి అమలు చేస్తోంది. మాతృభాషను వదిలేసి ఇంగ్లీష్‌ మీడియంలో చెప్పడం ఏంటన్న విమర్శలు గత 3ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి. దానిపై హైకోర్టులో కేసు కూడా ఉంది. అయినా జగన్‌ సర్కార్‌ ఇంగ్లీష్‌ మీడియం బోధనకే మొగ్గు చూపింది. పిల్లలు వెంటనే ఇంగ్లీష్‌ మీడియం చదువుల్లోకి మారడం కష్టం కాబట్టి బైలింగ్వల్‌ (ఒకవైపు ఇంగ్లీష్‌, మరోవైపు తెలుగు) పద్ధతిలో పుస్తకాలను అందించింది.

ఇప్పుడు తెలంగాణలోనూ ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచే ఇంగ్లీష్‌ మీడియం టీచింగ్‌ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇదొక్కటే కాదు ఏపీలో తీసుకొచ్చినట్లుగానే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. వీటిపై స్టడీ కోసం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో 11 మంది మంత్రులతో కమిటీ వేసింది. ఇందులో కేటీఆర్‌,
హరీష్‌రావు కూడా ఉన్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై చట్టాన్ని ఆమోదింపజేయాలన్న పట్టుదలతో ఉంది ప్రభుత్వం.

అదే జరిగితే వచ్చే ఏడాది నుంచే తెలంగాణలోనూ ఏపీ తరహాలోనే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం టీచింగ్‌ మొదలవుంది. మరి తెలంగాణలో దీనిపై ఇంకెంత రాజకీయం జరుగుతుందో!