Site icon HashtagU Telugu

Kidnap : శంషాబాద్ లో ఇంజనీర్ కిడ్నాప్ కలకలం.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఘ‌ట‌న‌

Crime

Crime

శంషాబాద్‌లో ఇంజ‌నీర్ కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. 5 గంటల పాటు కారులో తిప్పుతూ ఇంజ‌నీర్‌ని దుండ‌గులు చిత‌క‌బాదారు. 23 లక్షలు బాకీ ఉన్నట్లు బాండ్ పేపర్ ఫై అంగంత‌కులు సంతకాలు చేయించుకున్నార‌ని బాధితుడు ఆరోపిస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాలని ఓ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసిన‌ట్లు స‌మాచారం. హిమాయత్ నగర్ కు చెందిన చిరంజీవి (32) గతంలో భగీరథ ఇంజనీరింగ్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తూ .. ఏడాది క్రితం పని మానేసి నేషనల్ హైవే డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా చేరారు. అయితే ఈ నెల 12వ తేదీన భగీరథ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసే కృష్ణ, చంద్రశేఖర్, సుధాకర్ తో పాటు మరో వ్యక్తి నలుగురు ఫార్చునర్ కారులో వచ్చి మధురానగర్ నుండి ఇంజనీర్ చిరంజీవిని కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై తిప్పుతూ చితకబాదారని అంతటితో ఆగకుండా మరల శంషాబాద్ తీసుకుని వచ్చి శంషాబాద్ లోని రాధా హీరో హోండా సర్వీసింగ్ సెంటర్లో రూములో బంధించి బలవంతంగా బాండ్ పేపర్ పై 23 లక్షలు అప్పు ఉన్నట్లు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని బాధితుడు ఆరోపించారు. దీంతో బాధితుడు ఇంజనీర్ చిరంజీవి 14వ తేదీ శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపారు. నిందితులపై 365, 324, 384, 506, రెడ్ విత్ 34 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.