ED New Target: టీఆర్ఎస్ మంత్రికి బీజేపీ `ఈడీ` గాలం?

మునుగోడు ఉప ఎన్నిక‌ల ఓట‌మి క‌సితో ఉన్న బీజేపీ ప్ర‌తికారం తీర్చుకోవాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. ఆ క్ర‌మంలో టీఆర్ఎస్ మంత్రిని టార్గెట్ చేసింద‌ని వినికిడి.

  • Written By:
  • Updated On - November 9, 2022 / 02:13 PM IST

మునుగోడు ఉప ఎన్నిక‌ల ఓట‌మి క‌సితో ఉన్న బీజేపీ ప్ర‌తికారం తీర్చుకోవాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. ఆ క్ర‌మంలో టీఆర్ఎస్ మంత్రిని టార్గెట్ చేసింద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే ఆ మంత్రి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌డం ద్వారా మ‌రో ఉప ఎన్నిక తీసుకురావాల‌ని బీజేపీ స్కెచ్ వేస్తోంద‌ని స‌మాచారం. ఆ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని గ్రానైట్ కంపెనీల మీద ఈడీ దాడుల‌ను ముమ్మరం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఆర్థిక అవకతవకలకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్‌లోని పలు గ్రానైట్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధ‌వారం దాడులు నిర్వహిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి కరీంనగర్, హైదరాబాద్‌లలో 30 బృందాలు సోదాల వేగాన్ని పెంచింది. హైదరాబాద్‌లోని హైదర్‌గూడ, సోమాజిగూడ నివాసం ఉంటోన్న ఓ టీఆర్ఎస్ నేత ఆధ్వర్యంలో గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో దాడులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read:  PM Modi Tour: `మోడీ`కి మోదం, ఖేదం!

కొన్ని నెల‌ల క్రితం న్యాయవాది భేతి మహేందర్‌రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా గ్రానైట్‌ అక్రమాల వ్యవహారంపై ఈడీకి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన గ్రానైట్ అక్ర‌మాల‌ను ఫిర్యాదులో పొందుప‌రిచారు. కరీంనగర్‌లో ఉత్పత్తి అయిన గ్రానైట్‌ను ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి జ‌ర‌గుతోంది. అందుకు సంబందించిన కంపెనీల వివరాలు, యజమానులు వివరాలు, ఈమెయిల్‌ ఐడీలు ఇవ్వాల‌ను కూడా ఫిర్యాదు దారులు అందించిన‌ట్టు తెలిసింది. దీంతో ఆ కంపెనీలకు సంబంధించి ఈడీ దాడుల‌ను నిర్వ‌హిస్తోంది. కానీ, ఈ దాడుల‌న్నీ టీఆర్ఎస్ లోని ఒక మంత్రి కంపెనీల‌ను టార్గెట్ చేసుకుని జ‌రుగుతున్నాయ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.