Gaddam Vinod : గడ్డం వినోద్ నివాసంలో ఈడీ సోదాలు.. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతిపై ఇన్వెస్టిగేషన్

Gaddam Vinod : మంగళవారం ఉదయం చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ ఇళ్లు, నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ ముమ్మర సోదాలు చేసింది. 

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 10:14 AM IST

Gaddam Vinod : మంగళవారం ఉదయం చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ ఇళ్లు, నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ ముమ్మర సోదాలు చేసింది.  తాజాగా బుధవారం ఉదయం వివేక్ సోదరుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ ఇంట్లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసిందని తెలుస్తోంది. వినోద్ సహా భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌కు చెందిన నివాసాలు, ఆఫీసుల్లోనూ ఈడీ రైడ్స్ చేసిందని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

జి.వినోద్ గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)  అధ్యక్షుడిగా పనిచేశారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో జరిగిన అవినీతిపై మూడు ఛార్జిషీట్లను గతంలో తెలంగాణ ఏసీబీ దాఖలు చేసింది. ఏసీబీ ఛార్జిషీట్లలో ప్రస్తావించిన అంశాలపై వినోద్, శివలాల్, అయూబ్‌ల నుంచి ఈడీ అధికారులు సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. కాగా, మంగళవారం రోజు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 10.45 గంటల వరకు జీ. వివేక్ వెంకటస్వామికి చెందిన ఆఫీసులు, నివాసాలపై ఇన్ కం ట్యాక్స్ (ఐటీ) రైడ్స్ జరిగాయి.  హైదరాబాద్ సోమాజీగూడలోని వివేక్ నివాసం, బేగంపేటలోని విశాక ఇండస్ట్రీస్ కార్పొరేట్ ఆఫీసు, మంచిర్యాలలోని నివాసంలోనూ సోదాలు చేశారు. మంగళవారం  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఐటీ అధికారులు వివేక్ వెంకటస్వామి సోదరుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఇంట్లో కూడా సోదాలు జరిపారు.

Also Read: Whats Today : బీజేపీకి మద్దతుగా మందకృష్ణ ప్రచారం.. సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం