Yadadri Thermal Power Plant : అతి త్వరలో యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి

అతి త్వరలో యాదాద్రి ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతి ఇచ్చింది

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 05:01 PM IST

యాదాద్రి పవర్ ప్లాంట్ (Yadadri Thermal Power Plant) నుంచి విద్యుత్ ఉత్పత్తి (Power Generation) కి గ్రీన్ సిగ్నల్ (Green Signal) వచ్చేసింది. అతి త్వరలో యాదాద్రి ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (Union Department of Environment and Forests) అనుమతి ఇచ్చింది. దీంతో తొలి విడతలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, రెండో విడతలో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తెలంగాణ లోని నల్లగొండ జిల్లా, దామరచర్లలోని వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మాజీ సీఎం కేసీఆర్ 2015, జూన్ 8న భూమి పూజ చేసారు.రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలను తీర్చడానికి అప్పటి సీఎం కేసీఆర్‌ దామరచర్ల మండలంలో రూ.34వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టారు. ఈ పవర్ ప్లాంటు దక్షిణ భారతదేశంలోని రెండో అతిపెద్ద విద్యుత్ కేంద్రం. మొత్తం 5 యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్తును తయారు చేసేలా ప్లాంటు నిర్మించారు. బొగ్గు ఆధారితంగా పనిచేసే బాయిలర్ల పనుల్లో సుమారు 6 వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేయడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

అడవిదేవులపల్లి సమీపంలో టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపులైన్‌ నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ను ఒకసారి నింపితే 10 రోజులపాటు ప్లాంటు నీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాగే దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్‌ నుంచి యాదాద్రి థర్మల్‌ ప్లాంటు వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ ను నిర్మించడం జరిగింది.

Read Also : Nitin Gadkari faints : సభా వేదికపైనే స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి గడ్కరీ