Telangana: తెలంగాణ లో పెరగనున్న విద్యుత్ చార్జీలు

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమ‌తులు జారీ చేశారు.

  • Written By:
  • Publish Date - December 17, 2021 / 12:00 PM IST

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమ‌తులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవ‌కాశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపు పై ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని విద్యాశాఖను కేసీఆర్ ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న పేద ప్ర‌జ‌ల పై భారం ప‌డ‌కుండా.. ఛార్జీలు పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్ ల‌ను త్వ‌ర‌గా అందుబాటు లోకి తీసుకురావాల‌ని అన్నారు. ముఖ్యం గా సోలార్ పవ‌ర్ పై దృష్టి సారించాల‌ని సూచించారు.

అయితే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచ‌డానికి ముఖ్య కార‌ణం.. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌నే అని.. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రీన్ ఎన‌ర్జీ పై సెస్ ను భారీగా పెంచింద‌ని అన్నారు. రూ. 50 ఉండే గ్రీన్ ఎన‌ర్జీ సెస్ రూ. 400 వ‌ర‌కు కేంద్ర లోని బీజేపీ ప్ర‌భుత్వం పెంచింద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతుంది. దీంతో గ‌త ఏడేళ్ల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం పై రూ. 7,200 కోట్ల భారం పడినట్లు తెలుస్తుంది. అయితే త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.