Site icon HashtagU Telugu

Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో

Megha 966 Crores

Megha 966 Crores

Megha 966 Crores : రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాల చిట్టా బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 12న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. అయితే ఆ వివరాలను గురువారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం తమ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అందులోని సమాచారం ప్రకారం.. 2019 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వడంలో  దేశంలోనే నంబర్ 1 కంపెనీ  ఫ్యూచర్  గేమింగ్  అండ్  హోటల్  సర్వీసెస్  పీఆర్ . ఈ కంపెనీ ఏకంగా రూ.1368 కోట్లు పెట్టి ఎలక్టోరల్ బాండ్లు కొన్నది. తద్వారా ఆ డబ్బులన్నీ వివిధ రాజకీయ పార్టీల అకౌంట్లలోకి చేరాయి. ఇక రెండో ప్లేసులో మన  తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(Megha 966 Crores) నిలిచింది. ఈ కంపెనీ రాజకీయ పార్టీలకు ఐదేళ్లలో  రూ.966 కోట్ల విరాళాలు ఇచ్చింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు మేఘా కంపెనీ రూ.కోటి విలువైన 966 బాండ్లను కొనడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్ సైట్ లో రెండు లిస్టులు ఉన్నాయి  ఎలక్టోరల్  బాండ్లను కొన్న కంపెనీల వివరాలు తేదీతో సహా వివరాలన్నీ మొదటి లిస్టులో ఉండగా.. ఆ బాండ్లను ఎన్ క్యాష్​  చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలు తేదీతో సహా రెండో లిస్టులో ఉన్నాయి. ఏ కంపెనీ ఏ పార్టీకి డొనేట్  చేసిందన్న వివరాలను ఈసీ పొందుపర్చకపోవడం గమనార్హం. అలా పొందుపర్చకపోయినా దేశంలో ఎక్కువ విరాళాలు పొందిన పార్టీల లిస్టును చూస్తే అసలు విషయం అర్ధమైపోతుంది. విరాళాల విషయంలో దేశంలోనే నాలుగో స్థానంలో భారత రాష్ట్రసమితి నిలిచింది. దానికి దాదాపు  రూ.1,215 కోట్ల విరాళాలు వచ్చాయి. సహజంగానే ఆ పార్టీకి మేఘా ఇంజినీరింగ్‌ వంటి పలు తెలుగు కంపెనీల నుంచి విరాళాలు అంది ఉంటాయి. ఇక దేశంలోనే అత్యధిక ఎలక్టోరల్ బాండ్ విరాళాలు బీజేపీకి అందాయి. ఆ పార్టీకి రూ.6,060 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. సహజంగానే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాటరీ వ్యాపారాలు చేసుకునే లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్‌‌కు చెందిన ఫ్యూచర్  గేమింగ్  అండ్  హోటల్  సర్వీసెస్  పీఆర్‌ నుంచి  బీజేపీ సహా ఆయా రాష్ట్రాల్లోని కీలకమైన ప్రాంతీయ పార్టీలకు విరాళాలు అంది ఉంటాయి.  ఎన్నికల బాండ్ల రూపంలో ఏపీలో అందిన విరాళాల్లో వైఎస్సార్ సీపీదే అగ్రస్థానం. ఆ పార్టీకి ఇప్పటిదాకా రూ.337 కోట్లు అందాయి. టీడీపీకి రూ.219 కోట్లు వచ్చాయి. జనసేనకు రూ.21 కోట్లు వచ్చాయి.

Also Read : Free Coaching: గుడ్ న్యూస్.. ఆ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్

తెలుగు కంపెనీలు ఇచ్చిన విరాళాలు ఇవే..