తెలంగాణ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు(Election preparation) జరుగుతోంది. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడానికి బుధవారం హైదరాబాద్ వచ్చిన సీఈసీ అధికారులు శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర అధికారులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ను బేస్ చేసుకుని ఎన్నికల తేదీలను ప్రకటించడానికి అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును గమనిస్తే, గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల నిర్వహణకు కసరత్తు(Election preparation)
డిసెంంబర్లోపు చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించారు. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా సిద్ధమైతే ఆ రాష్ట్రానికి కూడా పోలింగ్ నిర్వహించడానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈసీ అధికారులతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి రహస్యంగా చర్చలు జరిపినట్టు ఆలస్యంగా వెలుగుచూస్తోంది. ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కొన్ని గంటల పాటు ఆయన రహస్యంగా ఉండిపోయారు. ఆ టైమ్ లో ఆయన ఎక్కడకు వెళ్లారు? అనేది ఇప్పటికీ ఇతిమిద్ధంగా తెలియదు. కానీ, ఈసీ అధికారులు కొందరితో ఆయన భేటీ అయినట్టు (Election preparation) ఆలస్యంగా వెలుగుచూస్తోంది.
సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలకు
ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణ ప్రభుత్వం గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని కేసీఆర్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. కానీ, రాష్ట్రం రాష్ట్రపతిపాలన పెట్టాలని బీజేపీ లీడర్లు నానా హంగామా ఇటీవల చేయడం చూశాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకులు, భూ కుంభకోణాల వెరసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ తెలంగాణ విభాగం చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేయడాన్ని విన్నాం.ఆ సందర్భంగా ఎన్నికలను పోస్ట్ పోన్ చేసి సాధారణ ఎన్నికలతో (Election preparation) పెడతారని ప్రచారం జరిగింది.
Also Read : Elections: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు- ఈసీ కీలక ఆదేశాలు
గత ఏడాది కాలంగా కేసీఆర్, బీజేపీ మధ్య చెడిందని అందరూ భావించారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా కేసీఆర్ ప్రచారం చేశారు. బీజేపీ ఢిల్లీ పెద్దల వాలకాన్ని రచ్చ చేశారు. వీడియోలను, ఆడియోలను న్యాయ వ్యవస్థలోని ఉన్నతాధికారులకు, పార్టీల చీఫ్ లకు పంపడం ద్వారా నానా హంగామా చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను విచారించడానికి తెలంగాణ సీఐడీ సిద్ధమైయింది దీంతో ఇరు పార్టీల మధ్య వ్యవహారం ముదిరిందని అనుకున్నారు. అంతలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగుచూసింది. ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఈడీ, సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ చెల్లు అంటూ ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చినట్టు అనిపిస్తోంది. అందుకే, కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీ ఢిల్లీ పెద్దలు కాపాడారని సర్వత్రా వినిపిస్తోన్న ఆరోపణ.
షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం నిర్ణయించడానికి సిద్ధమవుతున్నారని
బీఆర్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ నెలకొన్ని సమయంలో సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలకు (Election preparation) ఉంటాయని భావించారు. రాష్ట్రపతి పాలన పెట్టడం ద్వారా ఎన్నికలను పొడిగిస్తారని అంచనా వేశారు. లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణ , ఏపీ ఎన్నికలకు వస్తాయని అనుకున్నారు. ఫలితంగా బీజేపీ లాభపడుతుందని అంచనా వేశారు. కానీ, ఇరు రాష్ట్రాల మారిన రాజకీయ పరిణామాల క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా కావాలంటే ఆ విధంగా బీజేపీ సహకారం అందిస్తోంది. ఫలితంగా డిసెంబర్లో తెలంగాణ, ఏపీ ఎన్నికలు ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు వినికిడి. ఆ క్రమంలో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అధికారులు పర్యటించడం ద్వారా తుది నివేదికను తయారు చేయనున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం నిర్ణయించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
Also Read : CM KCR: ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది: సీఎం కేసీఆర్