Election Drugs : ఎన్నిక‌ల‌ ముందు `డ్ర‌గ్స్` కేసులు తెర‌పైకి..!

Election Drugs : తెలంగాణ ప్ర‌భుత్వానికి డ‌గ్స్ కేసు మ‌రోసారి స‌వాల్ గా నిలిచింది. గ‌తంలోనూ డ్ర‌గ్స్ కేసు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసింది.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 04:42 PM IST

Election Drugs : తెలంగాణ ప్ర‌భుత్వానికి డ‌గ్స్ కేసు మ‌రోసారి స‌వాల్ గా నిలిచింది. గ‌తంలోనూ డ్ర‌గ్స్ కేసు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈసారి కూడా ఎన్నిక‌ల ముందుగా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎప్పుడు ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ టాలీవుడ్ హీరోలు ఏదో ఒక రూపంలో బ్లేమ్ అవుతున్నారు. విచార‌ణను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇప్పుడు కూడా హీరో న‌వ‌దీప్ తో పాటు ప‌లువురు డ‌గ్స్ కేసుకు సంబంధించిన ఆరోప‌ణ‌ల‌ను ఫేస్ చేస్తున్నారు.

టాలీవుడ్ హీరోలు ఏదో ఒక రూపంలో బ్లేమ్ (Election Drugs)

తొలిసారిగా 2018 ఎన్నిక‌ల‌కు ముందు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌ట్లో సినిమా ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖుల‌ను విచార‌ణ కోసం పిలిచారు. వాళ్ల వెంట్రుక‌లు, గోళ్ల‌ను న‌మూనాగా తీసుకున్నారు. ఫోరెన్సిక్ కు పంపారు. ఆ ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత తెలంగాణ ఎక్సైజ్ శాఖ వాళ్ల‌కు క్లీన్ చిట్ ఇచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్క‌డా డ‌గ్ర్స్ ఆన‌వాళ్లు లేవ‌ని తేల్చేసింది. దీంతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఊపిరిపీల్చుకుంది. కానీ, డ‌గ్స్ ఆన‌వాళ్లు మాత్రం అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. ముంబాయ్ కేంద్రంగా డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడు తెలంగాణ‌కు సంబంధించిన మూలాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ త‌రువాత బెంగుళూరు కేంద్రంగా జ‌రిగిన దాడుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలోని డ్ర‌గ్స్ మూలాలు వెలుగుచూశాయి. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం (Election Drugs) నిమ్మ‌కుండి పోయింది.

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వెనుక పెద్ద‌లు

ఒకప్పుడు బాలీవుడ్ కు మాత్రమే ప‌రిమితం అయిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, శాంటిల్ వుడ్ ను పాకింది. అగ్ర హీరోలు, డైరెక్ట‌ర్లు, నిర్మాత‌ల‌ను గ‌తంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచార‌ణ చేసింది. అందుకు సంబంధించిన ఫైల్స్ ను ఒక్క‌సారిగా 2018 ఎన్నిక‌ల‌కు ముందుగా (Election Drugs)  మూసేసింది. వాటి వివ‌రాల‌ను హైకోర్టు అడిగిన‌ప్ప‌టికీ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం తెలంగాణ ప్ర‌భుత్వం చేసింద‌ని కాంగ్రెస్ పార్టీ త‌ర‌చూ చేసే ఆరోప‌ణ‌. అంతేకాదు, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వెనుక ప్ర‌భుత్వంలోని ఒక‌రిద్ద‌రు పెద్ద‌లు ఉన్నార‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగారు. దానికి బ‌లంచేకూరేలా న‌లుగురు ఎమ్మెల్యేల‌కు బెంగుళూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. వాటిని చూపుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టిక‌ప్పుడు తెలంగాణ‌లోని డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని తెర‌మీద‌కు తీసుకొస్తోంది.

Also Read : Madhapur Drugs case : డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న హీరో నవదీప్

ఎన్నిక‌ల వేళ మ‌ళ్లీ డ్ర‌గ్స్ వ్య‌వహారం మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది. బేబీ సినిమా చుట్టూ ఈ వ్య‌వ‌హారం తిరుగుతోంది. సినిమా నిర్మాణం రూపంలో ఒక‌ సంస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌కు చెందిన వ్యక్తి ఉన్నార‌ని ప్రాథ‌మిక రికార్డ్ ను బిల్డ‌ప్ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు  జరుపుతున్నారని గుర్తించారు. సూత్ర‌ధారిగా ఉన్న హీరో నవదీప్‌ పరారీలో ఉన్నారని సీపీ ఆనంద్ వెల్ల‌డించారు. ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశారు. హీరో నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్మాత కూడా పరారీలో ఉన్నట్లు సీవీ చెబుతున్నారు.

Also Read : Nayanatara New Business : నయనతార కొత్త బిజినెస్.. ఏ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారో తెలుసా ?

మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్ విభాగం పోలీసులు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ముగ్గురు నైజీరియన్లతో పాటు మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న అయిదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ సినీ నిర్మాత ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిషేధిత ఓపీఎమ్, పాపిస్ట్రాను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. విచార‌ణ కొనసాగిస్తున్నారు. గ‌త ఎనిమిదేళ్లుగా డ‌గ్స్ వ్య‌వ‌హారం కొత్త రూపాల‌ను తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప‌బ్ లు, సినిమా ఇండ‌స్ట్రీ, స్కూల్స్, కాలేజి ల‌వ‌కు ఈ క‌ల్చ‌ర్ పాకింది. ఎన్నిక‌ల టైమ్ లోనే డ‌గ్స్ విచార‌ణ వేగ‌వంతం చేయ‌డం, ఆ త‌రువాత ఫైల్స్ క్లోజ్ చేయ‌డం ష‌రామామూలు అయింది. ఈసారైనా డ్ర‌గ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణ‌ను మారుస్తారా? అనేది చూడాలి.