Assembly Elections: మోగిన ఎన్నికల నగారా, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!

తెలంగాణ సహా ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరిపేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సిద్ధమైంది.

  • Written By:
  • Updated On - October 9, 2023 / 02:54 PM IST

తెలంగాణ సహా ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరిపేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.01 లక్షల బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంది. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 16 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. సీనియర్స్ సిటీజన్స్ కు ఇక ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం ఉంది. ఎన్నిక షెడ్యూల్ తో వెంటనే కోడ్ కూడా అమలులోకి రానుంది. కాగా ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే అధికారులు బదిలీలు, పోస్టింగులకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధానాధికారులకు సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులు ఎవరూ తమ సొంత జిల్లాల్లో పని చేయకుండా చూడాలాని ఆదేశించింది.

తెలంగాణ షెడ్యూల్ ఇదే

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30 న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ షెడ్యూలులో పేర్కొన్నది. డిసెంబర్ 3‌న కౌంటింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 3వ తేదీన ఎన్నికల గెజిట్ విడుదల కానుండగా.. 10వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల స్క్రూట్నీ.. నవంబర్ 15వ తేదీ నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీగా షెడ్యూల్‌లో పేర్కొన్నారు. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీకి జనరి 16వ తేదీ వరకు నిర్వహించే వెసులుబాటు ఉన్నప్పటికీ మిజోరాంతో కలిపి నిర్వహిస్తున్నందున దాదాపు నెల రోజుల ముందే పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నది. గతేడాది డిసెంబరు 7న పోలింగ్ జరగ్గా 11న ఫలితాలు వెలువడ్డాయి.

ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా,  ఐదు రాష్ట్రాల్లో మొత్తం 16 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు.  ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.01 లక్షల బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంది.

మిగతా రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇవే

మధ్యప్రదేశ్ – 17 నవంబర్
రాజస్థాన్ – 23 నవంబర్
ఛత్తీస్‌గఢ్ – 7 నవంబర్, 17 నవంబర్ (దశ రెండు)
మిజోరం – 7 నవంబర్