Site icon HashtagU Telugu

Telangana polls: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్, తెలంగాణలో 684.66 కోట్లు సీజ్!

Cash

Cash

Telangana polls: నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా నగదు, మద్యం, బంగారం, వెండి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఫ్రీబీలు, ఇతర విలువైన వస్తువులతో సహా మొత్తం రూ.684.66 కోట్లను రాష్ట్ర, కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సీజ్ చేశాయి.

తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, లెక్కల్లో చూపని మొత్తం రూ.271.45 కోట్ల నగదు, రూ.183.83 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు, రూ.111.80 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు వంటి ఉచిత వస్తువులను కూడా 81.49 కోట్ల రూపాయల మేర స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఈసీ పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్‌రాజ్‌ తెలిపారు. 6 అసెంబ్లీ సెగ్మంట్లలో 5 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశామని చెప్పారు. 60 మంది వ్యయ పరిశీలకులను నియమించామని చెప్పారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రానికి ఒక పరిశీలకుడు ఉంటారన్నారు.

Also Read: Panja Vaisshnav Tej: మెగా హీరోకు హ్యాట్రిక్ ప్లాపులు.. అయోమయంలో వైష్ణవ్ తేజ్