Telangana Election : ముగిసిన ఎన్నికల ప్రచారం.. 144 సెక్షన్ అమల్లోకి : వికాస్ రాజ్

Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ మొదలయ్యిందన్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లోకి వచ్చిందన్నారు. ఎక్కడైన ఐదుగురికి మించి గుంపు చేరితో కఠిన చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

బుధవారం రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఎన్నికల అధికారులు వెళ్తారన్నారు. తొలిసారిగా హోం ఓటింగ్ జరిగిందని, 27,178 మంది తొలిసారిగా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.  సీసీ కెమెరాలో పర్యవేక్షణలో హోం ఓటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. నవంబరు 30న తెలంగాణవ్యాప్తంగా సెలవు ప్రకటించామని వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో  1.40 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు.. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్(Telangana Election) వంటివి తీసుకు రావాలన్నారు.

Also Read: Uttarkashi Tunnel Collapse: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం ఎలా జరిగింది? దాని కథేంటి ?

  Last Updated: 28 Nov 2023, 05:49 PM IST