తెరపైకి ‘ఈటల వెన్నుపోటు’.. క్లారిటీ ఇచ్చిన ఆర్జీవి..!

రాజకీయం అంటేనే వెన్నుపోట్లు.. దాడులకు ప్రతిదాడులు.. మాటల యుద్ధాలు.. ఒకరిపైమరొకరు తీవ్ర ఆరోపణలు.. ప్రస్తుతం ఇలాంటివన్నీ హుజూరాబాద్ లో చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికారి పార్టీ అయిన  టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో

  • Written By:
  • Updated On - October 22, 2021 / 12:47 PM IST

రాజకీయం అంటేనే వెన్నుపోట్లు.. దాడులకు ప్రతిదాడులు.. మాటల యుద్ధాలు.. ఒకరిపైమరొకరు తీవ్ర ఆరోపణలు.. ప్రస్తుతం ఇలాంటివన్నీ హుజూరాబాద్ లో చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికారి పార్టీ అయిన  టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ వల్ల పార్టీ విడాల్సి వచ్చిందని ఈటల.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఈటల పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు… ఇలా ఒకరినొకరు మాటల యుద్ధానికి తెరలేపారు. తర పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందంటూ పలు మార్లు ఆరోపించారు. దళిత బంధు, రైతుబంధు పథకాలకు తాను ఎప్పుడూ అడ్డుచెప్పలేదని, అయినా ప్రభుత్వం తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మాజీ ఈటల రాజేందర్ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కు సంబంధించిన ఓ వార్త మళ్లీ వైరల్ గా మారింది.

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్. ఆయన రక్తచరిత్ర, కడపరెడ్లు, వంగావీటి లాంటి సినిమాలు తీసి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. టీడీపీ అధినేత చంద్రబాబును విలన్ గా చిత్రీకరిస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పై కూడా ఆర్జీవీ సినిమా తీస్తారని ప్రచారం జరిగింది. అనాడు ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టుగా.. ఈటల కూడా కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని, ఈ నేపథ్యంలో ‘ఈటల వెన్నుపోటు’ పేరుతో సినిమా రానున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ అదంతా ఫేక్ అని, రాజకీయ లబ్ధికోసమే ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు.