Eelection in April : KCR కు అంతుబ‌ట్ట‌ని BJP స్కెచ్!  

Eelection in April : తెలంగాణలో కింగ్ కావాల‌ని బీజేపీ పావులు క‌దుపుతోంది. అయితే,తాజా పరిణామాలు ఆ పార్టీకి అనుకూలంగా లేవ‌ని స‌ర్వేల సారాంశం.

  • Written By:
  • Updated On - September 12, 2023 / 04:10 PM IST

Eelection in April : తెలంగాణలో కింగ్ కావాల‌ని బీజేపీ పావులు క‌దుపుతోంది. అయితే,తాజా పరిణామాలు ఆ పార్టీకి అనుకూలంగా లేవ‌ని స‌ర్వేల సారాంశం. బ‌హుశా అందుకేనేమో, ఎన్నిక‌ల‌కు డిసెంబర్ లోపు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. గతంలో మాదిరిగా కేసీఆర్ ఏది చెబితే, అది వినే ప‌రిస్థితుల్లో ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు లేరు. ఆ విష‌యం కేటీఆర్ తాజా వ్యాఖ్య‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. అక్టోబ‌ర్ 10వ తేదీ లోపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌పోతే, వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఛాన్స్ లేద‌ని ఆయ‌న భావిస్తున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల త‌రువాత ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఉంటుంద‌ని వెల్ల‌డించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏప్రిల్ వ‌ర‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఛాన్స్ లేద‌ని (Eelection in April )

స‌ర్వేల‌తో కేసీఆర్ ఎప్పుడు వ్యూహాన‌లు ర‌చిస్తారు. రెండోసారి సీఎం కావ‌డానికి కార‌ణం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు 2018 లో వెళ్ల‌డ‌మే. ఈసారి షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని భావించారు. లోక్ స‌భ ఎన్నిక‌ల కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నిక‌లు ముగుస్తాయ‌ని ఆశ‌ప‌డ్డారు. మూడోసారి ఏదోలా సీఎం కావాల‌ని వ్యూహాల‌ను ప‌న్నారు. అభ్య‌ర్థుల‌ను కూడా ముందుగా ప్ర‌క‌టించారు. మిగిలిన పార్టీల కంటే బ‌లంగా ఉన్నామ‌న్న సంకేతాల‌ను పంపించారు. అంతేకాదు, డిసెంబ‌ర్ వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ప్ర‌తి నెలా ఏదో ఒక ప‌థ‌కం కింద ఓట‌ర్ల‌కు డ‌బ్బు అందేలా ప్లాన్ చేశారు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఈసారి కేసీఆర్ అనుకున్న విధంగా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోగా, లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు (Eelection in April ) అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను పెట్టేలా ప్లాన్ చేశార‌ని తెలిసింది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో నీర‌సం ఆవ‌హించింద‌ని తెలుస్తోంది.

Also Read : Jagan Script : ఒక జ‌డ్జిమెంట్ బోలెడు కోణాలు.!

ఏపీలో కింగ్ మేక‌ర్, తెలంగాణ‌లో కింగ్ కావాల‌ని బీజేపీ వేసిన వ్యూహం. అందుకోసం ప్లాన్ ప్ర‌కారం పావులు క‌దుపుతోంది. ఆ క్ర‌మంలోనే ఏపీలో చంద్ర‌బాబు అరెస్ట్ అంటూ కొంద‌రు భావిస్తున్నారు. ఏపీలోని ప్ర‌ధాన పార్టీలు అన్నీ బీజేపీ అడుగుల‌కు మ‌డుగులొత్తుతున్నాయి. కానీ, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీలు క‌త్తులు దూసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాన్ని అవ‌కాశంగా తీసుకుని, ప్రాంతీయ పార్టీల‌ను నిర్వీర్యం చేయ‌డానికి వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. అందుకే, ఇప్పుడు చంద్ర‌బాబును జైలుకు పంపేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రోత్స‌హించిందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. త్వ‌ర‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్దు కానుంది. ఆ మేర‌కు బీజేపీ ప్లాన్ చేసింద‌ని తెలుస్తోంది. అప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆటోమేటిక్ గా జైలుకు వెళ‌తారు.

క‌ల్వ‌కుంట్ల కుటుంబం మీద ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు సీరియ‌స్

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అనివార్యంగా టీడీపీ, జ‌న‌సేన పొత్తుకు వ‌చ్చేలా చ‌ద‌రంగాన్ని బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు న‌డిపారు. ఎలాగూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ‌తారు కాబ‌ట్టి, అప్పుడు బీజేపీతో కూడిన‌ సంకీర్ణ ప్ర‌భుత్వం వ‌చ్చేలా స్కెచ్ వేశారు. దీంతో బీజేపీ వేసిన కింగ్ మేక‌ర్ స్కెచ్ ఏపీలో ఆటోమేటిక్ గా వ‌ర్కౌట్ అవుతుంది. ఇక తెలంగాణ‌లో కింగ్ ఎలా కావాలి? అనే అంశంపై మాత్రం క్లారిటీ రావ‌డంలేదు. ఎందుకంటే, బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంలా క‌నిపించిన బీజేపీ గ్రాఫ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డింది. స‌రిగ్గా ఇలాంటి పరిణామం ఏ మాత్రం బీజేపీకి ఇష్టం లేదు. అందుకే, బీఆర్ఎస్ పార్టీకి ప‌రోక్ష మ‌ద్ధ‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌స్తుతం క‌నిపిస్తుంది. కానీ, క‌ల్వ‌కుంట్ల కుటుంబం మీద ఉన్న ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు సీరియ‌స్ గా ప‌రిశీలిస్తున్నారు. ఎవ‌ర్ని ఎక్క‌డ పెట్టాలి? అనేది  (Eelection in April ) ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : KCR Strategy : కేసిఆర్ మౌనవ్యూహం ఏమిటి?

తెలంగాణ‌లో ఏదో రూపంలో అధికారంలోకి రావ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టింది. ఆ క్ర‌మంలో కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా? హ‌రీశ్ ను జైలుకు పంపుతారా? కేటీఆర్ ను డ్ర‌గ్స్ కేసులో ఇరికిస్తారా? క‌విత‌ను లిక్క‌ర్ స్కామ్ లో జైలుకు పంపుతారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని రెండు రోజులుగా ఇదే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీలో జ‌రిగిన ఊహించ‌ని ప‌రిణామం తెలంగాణ‌లోనూ ఏదో ఒక రూపంలో బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు న‌డుపుతార‌ని టాక్. అందుకే, ఏపీలో పురంధ‌రేశ్వ‌రి, తెలంగాణ‌లో కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు ఇవ్వ‌డం వెనుక కార‌ణం అంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుంది. బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌ను ప‌సిగ‌ట్ట‌డం ఒక మాత్ర‌న అర్థం కాదు. రాజ‌కీయ వ్యూహాలు వేయ‌డంలో కొమ్ముతిరిగిన కేసీఆర్ కూడా సైలెంట్ గా గ‌మ‌నిస్తున్నారు. ఆయ‌నకు కూడా అంతుబ‌ట్ట‌ని స్కెచ్ బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ర‌చిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే డిసెంబ‌ర్లోపు జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది ఏప్రిల్ కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.