PMLA Case : ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి లాక‌ర్ నుంచి 1.2 కేజీల గోల్డ్ స్వాధీనం

పటాన్‌చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు

  • Written By:
  • Publish Date - July 4, 2024 / 11:57 AM IST

పటాన్ చెరువు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) లాక‌ర్ నుంచి 1.2 కేజీల గోల్డ్ ( 1.2 kg of gold biscuits) ను స్వాధీనం చేసుకున్నారు ఈడీ (ED) అధికారులు. ఇటీవల మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 2 రోజుల పాటు ఆయన నివాసంలో బంధువుల ఇళ్లలో సోదాలు జరుపగా..మొత్తం రూ.300 కోట్ల అవినీతి జరిగిందని సోదాల్లో గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

మైనింగ్‌ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. రూ.39కోట్ల ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్టు ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జులై 02 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం తో..ఆయన హాజరయ్యారు. స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి ఆయన వెళ్లిపోయారు. మళ్లీ విచారణకు పిలిస్తే వస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. మ‌హిపాల్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ఈడీ దూకుడు పెంచింది. ఈరోజు పటాన్‌చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్‌లకు రసీదులు , డాక్యుమెంటేషన్‌లు లేవని ఈడీ గుర్తించింది. బంగారం దేశీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోలేదని , ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్‌రెడ్డి, వివిధ బినామీలకు చెందిన 100 రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎమ్మెల్యే, అతని కొడుకు ఇద్దరి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 300 కోట్ల విలువైన లోహాలు, ఖనిజాలను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్‌చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : Sam- Chaitu Divorce : సామ్ – చైతు విడిపోవడానికి చిరు సలహానే కారణమా..? ఏమన్నా ప్రచారమా..?