ED Raids : కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు

  • Written By:
  • Updated On - March 23, 2024 / 03:18 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో ఈడీ (ED) మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi CM Kejriwal ) ను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా..ఈరోజు కవిత బంధువుల ఇళ్లల్లో (Kavitha Relatives Houses) కూడా సోదాలు మొదలుపెట్టింది. కవిత భర్త బంధువుల ఇళ్ళలో , మాదాపూర్ లో కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో ఈడి సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ నెల 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజు తో ఈడీ కస్టడీ ముగియనుంది. అధికారులు ఆమెను మధ్యాహ్నం 12:30 గంటలకు రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే కవితను మరో 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ED) కోరే అవకాశం ఉంది. ఇప్పటికే మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి తీసుకుంది. ఇందులో భాగంగానే కవితను, కేజ్రీవాల్​ను ఒకేసారి ప్రశ్నించే యోచనలో వారు ఉన్నారు. ఇద్దరినీ కలిపి ప్రశ్నించేందుకు కవితకు కస్టడీ పొడిగింపు ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నారు.

మరోపక్క ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను రెండు రోజుల క్రితం ఈడీ అధికారులు అరెస్టు చేసారు. కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు కస్టడీ కోరడం తో ఇందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఆరు రోజుల పాటు ఈడీ అధికారులు అరవింద్ ను విచారించనున్నారు. మొత్తం మీద లిక్కర్ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Read Also : Rare Blood Group: అరుదైన బ్ల‌డ్ గ్రూప్ ఇదే.. ప్రతి 10 లక్షల మందిలో కేవలం నలుగురిలో మాత్రమే..!