Site icon HashtagU Telugu

ED Raids On Media: మీడియాపై ఈడీ దాడులు!

Ed

Ed

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈసారి మీడియాపై ఈడీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్ లో ఓ మీడియా హౌస్ పై ఈడీ సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ఓ దిన పత్రిక, ఇంగ్లీష్ ఛానల్ సంబంధించిన మీడియా ఆఫీసులో సోదాలకు దిగాయి.

ఇటీవల సోదాలు జరిపిన వారి బ్యాంకు ట్రాన్సక్షన్స్ నుండి ఓ మీడియా సంస్థ ఖాతాలోకి నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మీడియా హౌస్ పై సోదాలు చేస్తోన్న ఈడీ, మీడియా హౌస్ ప్రతినిధి బ్యాంకు ఖాతాలు, ట్రాన్సక్షన్స్ పరిశీలిస్తోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక, ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ కార్యాలయాలపై హైదరాబాద్‌లోని ఈడి అధికారులు దాడులు చేస్తున్నారు.