Site icon HashtagU Telugu

ED Raids : మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ అధికారుల సోదాలు

ED officials search Minister Ponguleti Srinivas Reddy

ED officials search Minister Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్‌లో గల ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూతురు, బంధువుల ఇళ్లలో రైడ్స్ కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఇన్ ఫ్రా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 15 బృందాలు తనిఖీలు చేపట్టింది.

Read Also: CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్ కు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం

ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంటిలో రైడ్స్ కొనసాగుతున్నాయి. ఢిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసింది. నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. దీనికి సంబంధం లేదని తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇఫ్పుడు జరుగుతున్న రైడ్స్ దానికి కొనసాగింపు అని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి చిన్న వయస్సులోనే బిలియనీర్‌గా మారారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. హర్ష రెడ్డి పేరుతో రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇది చర్చానీయాంశం అవుతుంది. ఆ క్రమంలో వరసగా ఈడీ రైడ్స్ జరగడం చర్చకు దారితీస్తోంది.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో రాఘవా ప్రైడ్‌లోనూ తనిఖీలు నిర్వహించారు.

Read Also: Revanth Govt : మాది నిర్మాణం – మీది విధ్వంసం – కేటీఆర్ ట్వీట్