ED vs Kavitha: కవితకు ఈడీ నోటీసులు, రేపు మళ్లీ విచారణ

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Ed Notices To Kavitha, Hearing Again Tomorrow

Ed Notices To Kavitha, Hearing Again Tomorrow

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీ చేశారు. కవితను మంగళవారం (మార్చి 21) ఉదయం 11 గంటలకు రమ్మన్నారు.

ఇవాళ ఆమెను ఈడీ (ED) అధికారులుు దాదాపు పదిన్నర గంటలకు పైగా విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు కూడా తీసుకున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది. ఉదయం కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. సాయంత్రం సాయంత్రం సమయంలో కవితను ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి ప్రశ్నించారు.

ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపించారు.

Also Read:  Kavitha Investigation: ముగిసిన కవిత విచారణ, అరెస్ట్ లేకపోవటంతో బీ ఆర్ ఎస్ శ్రేణుల హ్యాపీ

  Last Updated: 20 Mar 2023, 10:05 PM IST