MLC Kavitha: కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం!

లిక్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - September 14, 2023 / 01:44 PM IST

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. కొన్నాళ్లు సైలంట్ గా ఉన్న అకస్మాత్తుగా మళ్లీ తెరపై వచ్చింది. ఇప్పటికే ఎంతోమంది అప్రూవర్స్ గా మారడంతో లిక్కర్ కేసు మరోసారి చర్చనీయాంశమవుతోంది. అయితే తాజాగా లిక్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కవిత కు నోటీసులు ఇవ్వడంతో ఈ కేసు మరోసారి కీలకంగా మారనుంది.  అరుణ్ పిళ్లైతో పాటు వైఎస్‌ఆర్‌సి ఎంపి మాగుంట శ్రీనివాస రెడ్డి అప్రూవర్‌గా మారడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మళ్లీ విచారణకు పిలిచింది.

ఇతర నిందితులతో పాటు అరెస్టయిన ఎంపీ కుమారుడు రాఘవరెడ్డి, అప్పటి ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా, అరబిందో ఫార్మాకు చెందిన పి. శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయట ఉన్నారు. కొన్ని నెలల క్రితం మద్యం కుంభకోణంలో ఈడీ కవితను రెండుసార్లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను ఒకసారి ప్రశ్నించగా, ఈ మధ్య కాలంలో విచారణలో వేగం తగ్గింది.

ఈ కుంభకోణంలో నగదు లావాదేవీలు నిర్వహిస్తున్న కనీసం 20 మంది వ్యక్తులను గత రెండు వారాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిలిపించి వారి నుంచి సమాచారాన్ని సేకరించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. నాలుగు రోజుల క్రితం, కవిత ఆడిటర్ బుచ్చిబాబును కూడా మనీలాండరింగ్ కేసుల దర్యాప్తు, విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన విషయమై కీలక విషయాలను సేకరించింది. ఈ నేపథ్యంలో కవిత మరోసారి ఈడీ ముందుకు వెళ్తుండటం గమనార్హం. కాగా ఏపీలో చంద్రబాబు అరెస్ట్, తెలంగాణలో ఫస్ట్ జాబితాపై ఎమ్మెల్యేల నిరసన సెగలతో మౌనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కవిత నోటీసులతో ఎన్నికల ముందు గట్టి దెబ్బ తగిలినట్టయింది.

Also Read: Jr NTR: కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్, ఎందుకో తెలుసా!