Kavitha: కవిత భర్త, పీఆర్వో రాజేశ్ కి ఈడీ నోటీసులు జారీ

  BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(Kavitha husband Anil), పీఆర్వో రాజేశ్(PRO Rajesh), మరో ముగ్గురు అసిస్టెంట్లకు(assistants) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) నోటీసులు(Notices) ఇచ్చింది. సోమవారం(Monday) తమ ఎదుట విచారణకు( inquiry) హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్‌లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చెందిన రెండు ఫోన్లు, […]

Published By: HashtagU Telugu Desk
Ed Notices Issued To Kavith

Ed Notices Issued To Kavith

 

BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(Kavitha husband Anil), పీఆర్వో రాజేశ్(PRO Rajesh), మరో ముగ్గురు అసిస్టెంట్లకు(assistants) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) నోటీసులు(Notices) ఇచ్చింది. సోమవారం(Monday) తమ ఎదుట విచారణకు( inquiry) హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్‌లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చెందిన రెండు ఫోన్లు, మరో ముగ్గురు అసిస్టెంట్లకు చెందిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. మొత్తం పది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వీటిని తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని వారికి తెలిపింది.

https://twitter.com/TeluguScribe/status/1768987694582174050

మరోవైపు తన కూతురు, ఎమ్మెల్సీ కవితను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. కవిత కోసం ఢిల్లీ అడ్వోకేట్ టీమ్‌ను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతోనూ మాట్లాడుతున్నారు. కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈడీ రేపటి నుంచి కవితను ఏడు రోజుల పాటు విచారించనుంది. ఈ నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వోకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉండనున్నారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు… ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు. కవిత కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు ములాఖత్ ఉంటుంది. ఈ ములాఖత్ సమయంలో అడ్వోకేట్ టీమ్ అందుబాటులో ఉండి సూచనలు చేస్తుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉంటారు.

read also: Indian Navy : సముద్రపు దొంగల దూకుడుకు కళ్లెం వేసిన భారత నౌకాదళం

ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమెకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతలోనే ఇప్పుడు కవిత భర్తకు, మరో నలుగురికి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.

 

 

  Last Updated: 16 Mar 2024, 06:57 PM IST