Site icon HashtagU Telugu

ED On Kavitha: ఈడీ దూకుడు.. కల్వకుంట్ల కవితకు నోటీసులు?

Kavitha

Kavitha

ఢిల్లీ మద్యం పాలసీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నేతల పేర్లు వినిపిస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత పేరు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం పాలసీ కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని ఇటీవలే ఢిల్లీ బిజెపి ఆరోపించింది. దేశ రాజధానికి కొత్త మద్యం పాలసీని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, ఒబెరాయ్ హోటల్‌లో సమావేశాల్లో కవిత పాల్గొన్నట్టు బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయై ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకొచ్చి తనకు లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్న ఈడీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ప్రస్తుతం కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్‌లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసినట్టు సమాచారం. హోంక్వారంటైన్ లో ఉన్న కవిత ఈడీ నోటీసులపై రియాక్ట్ అయ్యారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, మీడియా వాస్తవాలు తెలుసుకోవాలని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Exit mobile version