Site icon HashtagU Telugu

ED Notices to Cong leaders: టీ కాంగ్రెస్ లీడ‌ర్ల మెడ‌కు హెరాల్డ్ కేసు, ఈడీ నోటీసుల జారీ

Ed (1)

Ed (1)

హెరాల్డ్ కేసు ఢిల్లీ నుంచి తెలంగాణ కు చేరుకుంది. తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ లీడ‌ర్ల‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ల‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అక్టోబ‌ర్ 10న ఢిల్లీలోని ఈడీ కార్యాయాల‌యానికి విచారణకు రావాల‌ని నోటీసుల్లో కోరారు. ఈడీ నోటీసుల విషయంపై స్పందించిన షబ్బీర్ అలీ, తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. ఒకవేళ నోటీసులు వస్తే విచారణకు హాజరు అవుతానని కూడా ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం మెట్లు ఎక్కించిన నేషనల్ హెరాల్డ్ కేసు తాజాగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ (టీపీసీసీ)కి చెందిన నేతల మెడకు చుట్టుకుంది. టీపీసీసీకి చెందిన ఐదుగురు కీలక నేతలను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Exit mobile version