ED 3rd Degree On MLC Kavitha : కవిత ఫై థర్డ్ డిగ్రీ..? ఎంత నిజం..?

గతంలో కూడా ఈ కేసులో పలువురి ఫై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అప్రూవల్ గా మార్చారు. ఇప్పుడు తనపై కూడా అలాగే ప్రయోగిస్తున్నారని చెప్పి కవిత తన పిటిషన్ లో తెలిపినట్లు

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 07:45 PM IST

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam)లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె రిమాండ్ లో ఉంది. ఈ నెల 23 వరకు ఈమెను రిమాండ్ కు తరలించడం తో ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు ఆమెపై థర్డ్ డిగ్రీ (ED 3rd Degree) ప్రయోగిస్తున్నారని..ఈడీ అధికారుల థర్డ్ డిగ్రీకి కవిత కన్నీరుమున్నీరు పెట్టుకుంటున్నారనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది..? కవిత ఫై థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చా..? ప్రయోగించే ఛాన్స్ ఉందా..? అనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు.

తాజాగా కవిత సుప్రీంకోర్టులో మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ కవిత తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది కోరారు. తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆమె చెప్పుకొచ్చారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు కవిత తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని, ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఈ పిటిషన్ లో కవిత తనపై ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని చూస్తున్నారు..గతంలో కూడా ఈ కేసులో పలువురి ఫై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అప్రూవల్ గా మార్చారు. ఇప్పుడు తనపై కూడా అలాగే ప్రయోగిస్తున్నారని చెప్పి కవిత తన పిటిషన్ లో తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈడీ మాత్రం కవిత మీము అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పడం లేదని వారు అంటున్నారు. కానీ కవిత మాత్రం థర్డ్ డిగ్రీ ప్రయోగించి..చేయని నేరాన్ని తనపై వేయాలని చూస్తున్నారని ఆమె వాపోతుంది. మరి ఇందులో ఎవరు చెప్పే దాంట్లో నిజం ఉందనేది అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి కవిత కు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారనే వార్త బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది.

Read Also : DMK Manifesto: ఎన్నిక‌ల వాగ్దానాలు షురూ.. పెట్రోల్‌పై రూ. 25, డీజిల్‌పై రూ. 27 త‌గ్గింపు..?