Site icon HashtagU Telugu

EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్

EC Notice To KCR

EC Notice To KCR

EC Notice To KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.

కాగా ఈ రోజు నిర్వహించిన సభలో కేసీఆర్ ఏమన్నారంటే.. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో కొనసాగడం అసంభవం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశం లేదు. త్వరలో బీజేపీలోకి ఎవరు జంప్ చేస్తారో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

We’re now on WhatsAppClick to Join

కేసీఆర్ మరింత లోతుగా వెళుతూ… ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కేసీఆర్ మండిపడ్డారు. అంబేద్కర్‌ను మన గుండెల్లో పెట్టుకునేందుకు రాష్ట్ర సచివాలయం ముందు 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించాం. అంబేద్కర్ జయంతి రోజున కూడా ఈ ప్రభుత్వం సందర్శించలేదు. నేను విగ్రహాన్ని నిర్మించాను కాబట్టి వారు విగ్రహానికి పూలమాలలు వేయలేదు, నివాళులర్పించలేదు అని ఆయన ఆరోపించారు. యాదాద్రి ఆలయాన్ని తానే కట్టినట్లు చెప్పారు అయితే దానిని కూడా మూసివేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేను కట్టిన సెక్రటేరియట్‌లో నువ్వు ఎందుకు కూర్చున్నావు అని నిలదీశారు కేసీఆర్.

Also Read: CM Revanth Reddy: బీజేపీలోకి సీఎం రేవంత్ కు ఆహ్వానం