KTR Comments: బీజేపీ క‌నుస‌న్న‌ల్లో ఈసీ న‌డుస్తోంది.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

కేసీఆర్‌పై ఈసీ 48 గంట‌లు నిషేధం విధించిన క్ర‌మంలో కేటీఆర్ ఎన్నిక‌ల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.

  • Written By:
  • Updated On - May 2, 2024 / 05:52 PM IST

KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిక‌ల సంఘంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు (KTR Comments) చేశారు. కేసీఆర్‌పై ఈసీ 48 గంట‌లు నిషేధం విధించిన క్ర‌మంలో కేటీఆర్ ఎన్నిక‌ల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మొద‌టి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఈసీ నిషేధం విధించింది. ఎన్నిక‌ల సంఘం బిజెపి కనుసన్నల్లో నడుస్తుందని మండిప‌డ్డారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఒక్క బీజేపీ నాయకుడిపై కూడా ఈసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

ఇంకా మాట్లాడుతూ.. ముస్లిం సోదరులపై ప్ర‌ధాని మోదీ మాట్లాడిన మాటలకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. శ్రీ రాముడు బొమ్మ పెట్టుకొని అమిత్ షా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. దీని పై ఈసీకి ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని దుయ్య‌బ‌ట్టారు. బీజేపీ ఫర్ ఇండియా అని బీజేపీ అధికారిక ఎక్స్‌ అకౌంట్ లో మత విద్వేషాలు రెచ్చగొడుతు పోస్టులు పెడుతున్నారు.. దీనిపైన ఈసీ ఎటువంటి చర్యలు ఈసి తీసుకోదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read: NEET Admit Card: నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డ్స్ విడుద‌ల‌.. ఎగ్జామ్‌కు వెళ్లేవారి డ్రెస్ కోడ్ ఇవే..!

మా నాయకుడు కేసీఆర్ సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి పరుషంగా ఒక్క మాట మాట్లాడినందుకు కేసీఆర్ పై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ చర్యలు తీసుకుంది. మ‌రీ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ 8 ఫిర్యాదులు ఈసికీ చేస్తే ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ తల నరకండి అని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు ఈసీకి ఇస్తే కాంగ్రెస్ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ బస్సు యాత్ర చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు దడ పుట్టింది. జన స్పందన వస్తుంటే బడే బాయ్, చోటే బాయ్ కలిసి కేసీఆర్‌పై కుట్ర చేశారని విమ‌ర్శించారు.

We’re now on WhatsApp : Click to Join

సర్వేల ప్రకారం 8 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసి కుట్ర చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కచ్చితంగా ఓటుతో బుద్ది చెప్తారు. రేవంత్ రెడ్డి మాటలు ఉటంకించాలన్న మాకు సిగ్గు అనిపిస్తుంది. మోదీకి నోటీసులు ఇవ్వాలన్న ఈసీ భయపడుతుంది. స్వతంత్ర హోదా కలిగిన ఎల‌క్ష‌న్ కమిష‌న్ ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదు. తాత్కాలికంగా 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయ‌కుండా ఆపగలరేమో గాని.. ప్రజల మనస్సులో నుండి కేసీఆర్‌ను దూరం చేయ‌లేర‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.