CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి‌కి ఈసీ నోటీసులు

"కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడు.." అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 11:15 PM IST

ఎన్నికల సంఘం (EC) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై వ్యక్తిగతంగా ,అసభ్యపదజాలం వాడినందుకు నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. గడువు ముగిసేసరికి వివరణ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ప్రచారంలో నేతల ప్రసంగలు, కామెంట్లపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈసీ నోటీసులు జారీ చేయడం చేస్తుంది. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(K Chandrasekhar Rao) కు కూడా నోటీసులు జారీ చేయడం..48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈక్రమంలో ఇప్పుడు రేవంత్ కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది.

ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడు..” అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. రైతుబంధు సాయం, రైతురుణమఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్న క్రమంలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో.. సీఎ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

Read Also : Pawan Kalyan : పిఠాపురంలో పవన్ రోడ్ షో కు ప్రజలు బ్రహ్మ రథం