తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని ఈసీ (EC Notice)నోటీసులు జారీ చేసారు. మరో నాల్గు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కాగా గత కొద్దీ రోజులుగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభ పేరుతో అన్ని నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేసీఆర్ తన సభల్లో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీఐ అడ్వైజరీ కమిటీ లేఖను సీఈవో వికాస్ రాజ్ (CEO Vikasraj) శుక్రవారం సీఎం కు పంపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఈసీ తెలిపింది. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించొద్దని హితవు పలికింది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై స్పందిస్తూ బాన్సువాడ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భిన్న కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంపొందించేలా ఈ ప్రసంగం ఉంది. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే’ అని ఈసీఐ స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి ప్రసంగాలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇది ఫస్ట్ వార్నింగ్ అని, ఇలా రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడినా పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని గుర్తు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆయన కోలుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ ఘటనపై కేసీఆర్ స్పందించిన తీరు ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించగా స్థానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14న ఈసీకి రిపోర్ట్ చేసింది. నివేదిక ఆధారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఈసీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.
Read Also : TS Polls 2023 : కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే బాగుండేదే – సీతారాం ఏచూరి