తెలంగాణ ఓటర్లకు గుడ్ న్యూస్ తెలిపింది ఎన్నికల కమిషన్ (EC). రాష్ట్రంలో ఎండ తీవ్రత ను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తుంది. ఇప్పటీకే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా మే 13 న మూడోవిడత పోలింగ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరుగనుంది. ఇక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ తమ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్నారు.
ఇక ఎన్నికల పోలింగ్ తాలూకా వివరాలను బుధువారం మీడియా తో పంచుకున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్. ఎన్నికల బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు ఉన్నారని, సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Read Also : Pawan Kalyan : తగ్గేదేలే అని నాకు చెప్పడం కాదు.. బన్నీ ఫ్యాన్స్‌కి పవన్ చురకలు..